ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సుకు లైట్లు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ట్రాక్టర్​ డ్రైవర్, బస్సు ప్రయాణికులను చికిత్స కోసం మహదేవపూర్​ ఆసుపత్రికి తరలించారు.

rtc bus hit tractor at jayashankar bhupalpally district
ఆగి ఉన్న ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Sep 1, 2020, 10:33 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని నుంచి భూపాలపల్లికి వెళ్తున్న భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో బస్సు లైట్లు చెడిపోగా డ్రైవరు బస్సును అలాగే నడుపుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ఆగిఉన్న ట్రాక్టర్​ను ఢీకొంది. ట్రాక్టర్​ వెనుక భాగంలో ఏదో చప్పుడు వస్తుంటే ట్రాక్టర్​ రోడ్డు పక్కగా ఆపి ట్రాక్టర్​ను పరిశీలిస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ట్రాక్టర్​ డ్రైవర్ వల్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల నాగరాజుగా గుర్తించారు. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానిక మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్పగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.