కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. దహేంగం మండలం ఐనం గ్రామానికి చెందిన వెల్ములే మురళీధర్ తన కొడుకు నిఖిల్‌తో కలిసి వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా బోడేపల్లి వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరికి తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తరలించే క్రమంలో కుమారుడు మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఇస్గాం ఎస్. ఐ. రాజేశ్వర్ విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:బడికి వెళ్లలేదని పిల్లాడి ఒంటిపై వాతలు పెట్టిన తల్లి