రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గన్గల్ గ్రామానికి చెందిన నరేశ్(34) ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలో ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్(34) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీచూడండి: ఓ వైపు వర్షం... మరో వైపు అంధకారం... నగరవాసుల ఇక్కట్ల పర్వం