ETV Bharat / jagte-raho

ఎదురెదురుగా ఢీకొన్న లారీ, టాటా ఏస్​.. ఇద్దరికి గాయాలు.. - లారీ

టాటా ఏస్​, లారీ ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా అడివెముల వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ జరుపుతున్నారు.

road accident at adivemula in suryapeta district
ఎదురెదురుగా ఢీకొన్న లారీ, టాటా ఏస్​.. ఇద్దరికి గాయాలు..
author img

By

Published : Nov 1, 2020, 10:53 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన అనంతుల శ్రీను, మంగదొడ్ల వెంకటేశ్​ సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం నుంచి టాటా ఏస్​ వాహనంలో కోళ్లను తీసుకొస్తున్నారు. ఆడివేముల స్టేజీ వద్ద ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టారు. టాటా ఏస్​ క్యాబిన్​ శ్రీను, వెంకటేశ్​ ఇరుక్కుపోయారు.

ఘటనా స్థలి చేరుకున్న పోలీసులు గ్యాస్ కట్టర్​ సహాయంతో ఇనుమును కోసి ఇద్దరిని బయటికు తీశారు. వారిని సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో హైరరాబాద్​కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.