చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి నాయక్ (37) గుండెపోటుతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అనువాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన రవినాయక్పై చైన్ స్నాచింగ్ కేసుల్లో రెండున్నర నెలల క్రితం పీడీ యాక్ట్ కింద కేసు నమోదైంది. అతనిపై శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావటంతో జైలులో రిమాండ్లో ఉన్నాడు.
కాగా జైలు అధికారులు, పోలీసులు కొట్టిన దెబ్బలకే తన భర్త మరణించాడని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కుషాయిగూడలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్లపల్లి జైలు సూపరింటిండెంట్, శంషాబాద్ సీఐ వెంకట్ రెడ్డిలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రవినాయక్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు జైలు అధికారులు తరలించారు.
ఇదీ చదవండి: తెర వెనుక చైనా.. కూపీ లాగుతున్నాం: అవినాష్ మహంతి