ETV Bharat / jagte-raho

రిమాండ్‌ ఖైదీ మృతి.. జైలు బ్యారక్​ను సందర్శించిన న్యాయమూర్తి - Today News Rimand Prisioner Died Kaarimnagar Jail

చికెన్ సెంటర్​లో ఓ వస్తువు దొంగిలించిన కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ ఘటన కరీంనంగర్ జిల్లా ఏరియా సివిల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రిమాండ్‌ ఖైదీ మృతి.. జైలు బ్యారక్​ను సందర్శించిన న్యాయమూర్తి

author img

By

Published : Sep 15, 2020, 10:30 AM IST

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంబు కొమురయ్య (45) తాడికల్‌ లోని చికెన్‌ సెంటర్​లో సామగ్రి దొంగతనం కేసులో అరెస్టు అయ్యాడు. ఈ నెల 10న నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆదివారం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో రాత్రి జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.

మద్యానికి బానిస..

ప్రతి రోజు మద్యం తాగే అలవాటు ఉండటం వల్ల జైలులో రెండు మూడు రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తించేవాడని, అతడిని ప్రత్యేకంగా జైలు వైద్యుడి పర్యవేక్షణలో ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్‌ జి.సమ్మయ్య తెలిపారు. కొమురయ్య మృతిపై జైలు అధికారులు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏసీపీ పి.అశోక్‌ విచారణ చేపట్టారు.

జిల్లా న్యాయమూర్తి ఆస్పత్రి సందర్శన..

సోమవారం ఉదయమే మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సివిల్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. కొమురయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్థులు కేశవపట్నం పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లా పీసీఆర్‌ కోర్టు న్యాయమూర్తి సాయిసుధా ఆస్పత్రికి చేరుకుని మృతుడి భార్య సంబు లచ్చవ్వతో పాటు గ్రామస్థుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

జైలులో ఆరా ..

అనంతరం న్యాయమూర్తి జైలును సందర్శించి కొమురయ్య ఉన్న జైలు గదిని పరిశీలించారు. అతనితో ఉన్న ముగ్గురు ఖైదీలను కొమురయ్య మృతిపై ఆరా తీశారు.

ఇవీ చూడండి : 'జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.