హైదరాబాద్‌లోని వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో దారుణం జరిగింది. తల్లీకూతుర్లపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు నర్సింహ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పరిచయం చేసుకుని ఆమెను బెదిరించి ఆమెతో లైంగిక చర్యకు దిగాడు నర్సింహ. అంతటితో ఆగకుండా మగతోడు లేని ఆ మహిళ కుటుంబం బలహీనతను ఆసరాగా చేసుకుని ఆమె కూతురినీ బెదిరించి అత్యాచారం చేశాడు. ముభావంగా ఉంటున్న కూతురుని తల్లి ప్రశ్నించగా విషయం చెప్పింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'