హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ హిల్స్ కాలనీలో ఓ కామాంధుడు కళ్లు మూసుకుపోయి.. ఆవుదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో గోడదూకి ఆవు దూడపై లైంగికదాడి చేయడాన్ని నోముల సిద్ధరాజు అనే వ్యక్తి గమనించాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో పారిపోయాడు.
అయితే నోముల సిద్ధరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పట్టుకున్నారు. ఆవు దూడపై లైంగిక దాడి చేసిన వ్యక్తి సంజయ్ వర్మగా గుర్తించారు. సంజయ్ వర్మ ఎల్బీనగర్లోని ఓ మార్బుల్ షాపులో కూలి పని చేస్తాడని.. స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ బండా జిల్లాకు చెందినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు