మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పేట్-బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన తమ్ముడి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
వైజాగ్‌కు చెందిన ఓ యువతి ఉన్నత విద్య కోసం 2018లో తన తల్లితో కలిసి నగరానికి వచ్చి పేట్-బషీర్‌బాగ్ సమీపంలో నివాసం ఉంటోంది. సమీపంలోనే ఉండే పెద్దనాన్న వద్దకు తరచూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో వృత్తిరీత్యా డాక్టర్ అయిన పెదనాన్న వినోద్‌కుమార్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. యువతిని లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫలితంగా యువతి విషయం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
ఈ క్రమంలో యువతి ఆరోగ్యం క్షీణించింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు యువతిని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా కుటుంబ సభ్యులు షీ-టీమ్‌ను ఆశ్రయించగా.. వారి సహకారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేట్-బషీర్‌బాగ్ ఏసీపీ నరసింహరావు తెలిపారు.
ఇదీచూడండి.. పేకాట స్థావరంపై దాడి.. నిర్వాహకుడు సహా 9 మంది అరెస్ట్