ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అరెస్ట్ - peddapalli crime updates

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు శిక్షణ ఐపీఎస్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ramagundam Police have arrested two robbers for two-wheeler thefts
ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Nov 6, 2020, 4:59 PM IST

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల వరస చోరీలకు పాల్పడుతోన్న తీగల రజినీకాంత్‌తో పాటు మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సీసీ నస్పూర్ కాలనీలో మూడు, రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఒకటి, సోమగూడెంలో ఒకటి చొప్పున బైకులను దొంగలించారని పోలీసులు తెలిపారు. నస్పూర్ పోలీసుల సహాయంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరు నిందితులను వెంబడించి పట్టుకున్నారు.

నిందితులు వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న రామగుండం సీసీఎస్ పోలీసులను శిక్షణ ఐపిఎస్ అశోక్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో సీసీఎస్, ఎస్‌సీపీ గణేష్, సీఐలు వేంకటేశ్వర్, జి.వెంకటేశ్వర్లు, ఎస్సై కిరణ్ కుమార్, అశోక్ కుమార్, తిరుపతిరెడ్డి, దేవేందర్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దారికాస్తున్నారు... విచ్చలవిడిగా దోచేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.