ETV Bharat / jagte-raho

లక్షలు కావాలంటూ డిమాండ్.. నకిలీ నక్సలైట్ అరెస్ట్ - hyderabad news

నకిలీ నక్సలైట్​ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కుషాయిగూడ పరిధిలో చోటు చేసుకుంది. యాదాద్రికి చెందిన నరసింహ... నక్సలైట్​నంటూ వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

rachakonda-polices-arrested-fake-naxalite-at-kushaiguda
లక్షలు కావాలంటూ డిమాండ్.. నకిలీ నక్సలైట్ అరెస్ట్
author img

By

Published : Feb 4, 2021, 12:37 PM IST

నక్సలైట్​నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన కుషాయిగూడ పరిధిలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన నరసింహ... అలియాస్ దామోదర్.. అలియాస్ దాము... హైదరాబాద్​లోని భగవాన్ కాలనీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను నక్సలైట్​నని... 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా... పథకం ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పది సంవత్సరాలుగా నకిలీ నక్సలైట్ అవతారమెత్తి కొందరని టార్గెట్ చేస్తూ... అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కారును స్వాధీనం చేసుకున్నారు. లెటర్​ ప్యాడ్​లో మరింత సమాధానం ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రూబీ గోల్డ్ కుంభకోణం: పటేల్​గూడలో మరోసారి సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.