హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు ఎన్ మల్లికార్జున్ రావు (47) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిక్కడపల్లి వివేక్నగర్లో అమర లింగేశ్వర ఉమెన్స్ హాస్టల్నిర్వాహిస్తున్నాడు. లాక్డౌన్తో హాస్టల్ నిర్వహణ భారం కావడం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక.. వారిని తొలగించి ఆయనే నిర్వహిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక హాస్టల్లోని ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుడు కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్