కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. బిడ్డను ప్రసవించిన కొద్దిసేపటికే బాలింత మృతి చెందింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం కోసం చిర్రకుంటకు చెందిన కె.ప్రభాకర్ తన భార్యను చేర్పించాడు. శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించగా... రాత్రి 11.45కు ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు.
కొంతసేపటికి బాలింతకు రక్తస్రావం కావడం గుర్తించిన వైద్యులు ఆమెను మంచిర్యాలలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఆసిఫాబాద్ తీసుకొచ్చేసరికే వైద్యులు ఆస్పత్రికి తాళాలు వేసి పరారయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: ట్రాక్టర్ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి