సంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ అధికారిణి అరుణ మృతదేహం కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మనురు మండలం రాయిపల్లి వంతెన వద్ద మంజీరా నదిలో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
నారాయణఖేడ్ సీఐ రవీందర్రెడ్డి, ఎస్సై నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలను మోహరించారు. గత ఈతగాళ్లు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.