మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఫకీరాతండా, బుడ్డితండా, బక్కతండా, కురవి మండలం రేకులతండాల్లోని గుడుంబా స్థావరాలపై ఆబ్కారీ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 110 కిలోల నల్ల బెల్లం, 15 కిలోల పటికను స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు.
తొర్రూరు మండలం కంఠాయపాలెం శివారులో ఆటో, బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 10 బస్తాల బెల్లం, 50 కిలోల పటిను సీజ్ చేసి.. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఆబ్కారీ సీఐ లావణ్యసంధ్య తెలిపారు.
ఇదీ చూడండి: జీన్స్ ప్యాంటులో బంగారు బిస్కెట్లు... దొరికిపోయిన ప్రయాణికుడు