చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక పెద్దమ్మ గుండె పోటుతో మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని చితలపాళెంలో జరిగింది. చింతలపాళెంలో కొద్ది రోజులుగా రైతులు, షీకారుల మధ్య వివాదం జరుగుతోంది.
ఈ వివాదంలో ఇటీవల కాలంలో షికారీకి చెందిన బబ్లీ(36)హత్యకు గురయ్యారు. ఈ మరణ వార్త విని శ్రీకాళహస్తి మండలంలోని ఎంపెడు ఈశ్వరయ్య కాలనీకి చెందిన బబ్లీ పెద్దమ్మ సరోజమ్మ(70) గుండె పోటుతో మృతి చెందారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఏఎస్పీ ముని రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు