రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 8.3లక్షల విలువైన 11తులాల బంగారు, 128తులాల వెండి ఆభరణాలతో పాటు రెండు ఎల్ఈడీ టీవీలు, ఓ ద్విచక్ర వాహనం, రూ.23వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
నిందితులు షేక్ రఫీ, నవీన్లు.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడిన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులపై ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 10చోరీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాలనీలలో ఎవరైనా అనుమానస్పందంగా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు.
ఇదీ చదవండి: తాళాలు పగలగొట్టి .. బాధ్యతలు అప్పజెప్పారు