ETV Bharat / jagte-raho

డెలివరీ బాయ్ టూ డ్రగ్స్ డెలివరీ - hyderabad news

అతడు ముంబై మహానగరంలో డెలివరీ బాయ్​గా చేరాడు. కొన్ని రోజులు బాగానే పని చేసినప్పటికీ .. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. పబ్​లో పరిచయమైన వ్యక్తి మాటలను నమ్మి డ్రగ్స్ సరఫరా వల్ల అధికంగా సంపాదించాలనే అత్యాశను పెంచుకున్నాడు. చివరకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Police have arrested a man for selling drugs
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/01-January-2021/10086762_12_10086762_1609518851428.png
author img

By

Published : Jan 1, 2021, 10:28 PM IST

డ్రగ్స్ విక్రయిస్తున్న ఆశిష్ కుమార్ అనే వ్యక్తి​ని గోపాలపురం పోలీసులు, ఉత్తర మండల టాస్క్​ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 60 వేల విలువైన 12 గ్రాముల నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర టాస్క్​ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

డెలివరీ బాయ్​గా..

గతంలో ఆశిష్ కుమార్ డెలివరీ బాయ్​గా చేరాడు. త్వరగా అధికంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో జామా సాబ్రీ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతడి ద్వరా డ్రగ్స్ విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.

పక్కా ప్రణాళికతో..

ఆశిష్ కుమార్, సాబ్రీ ఇద్దరూ కలిసి ముంబై నగరం నుంచి హైదరాబాద్​లో ఉన్న పలు పబ్​లు, క్లబ్​లకు డ్రగ్స్ సరఫరా చేసే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సికింద్రాబాద్​లోని ఎస్.డి రోడ్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఆశిష్ కుమార్​ని పోలీసులు అరెస్టు చేశారు. సాబ్రీ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.