లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి రౌడీ షీటర్ చాందీ మహ్మాద్, ఫయాజుద్ధీన్ అలియాస్ అబు బైక్‌పై వెళ్తున్నారు. ఆలివ్ ఆసుపత్రి సమీపంలో క్వాలిస్‌తో వారిని ఢీకొట్టిన దుండగులు అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. అశ్వక్ గ్యాంగే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కారులో నలుగురు, ద్విచక్ర వాహనంపై ఇద్దరు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్యలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన