ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామలోని హరిజనవాడలో కోట ఏసుబాబు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాడు. రాత్రి సమయంలో ఆటలు ఎందుకు ఆడుతున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసుబాబుపై చేయి చేసుకున్నారు. నేనేం తప్పు చేశా.. ఎందుకు కొడుతున్నారని ఏసుబాబు ప్రశ్నించగా.. మాకే ఎదురు చెప్తావా అంటూ.. లాఠీలు వీరిగిపోయేలా కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఏసుబాబు తలకు తీవ్ర గాయమైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏసుబాబుని కాలనీవాసులు సాయంతో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యలతో తన కుమారుడు మరణిస్తే ఏంటి పరిస్థితి అంటూ బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: బైక్ను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మిత్రులు మృతి