గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా రోగి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న వైద్యుడిపై దాడికి దిగారు. వార్డులో ఉన్న కుర్చీ తీసుకొని వైద్యుడిపై విసిరారు. ఈ ఘటనలో వైద్యుడి తలకు స్వల్ప గాయమైంది.
దాడిని నిరసిస్తూ పీజీ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రి ముందు రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. కరోనాను అరికట్టేందుకు ముందు వరుసలో ఉన్న వైద్యులు, సిబ్బందిపై దాడి చేస్తే సహించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి