విశాఖపట్నం నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ఇన్నోవా కార్లో గంజాయి రవాణా అవుతున్నదనే సమాచారంతో పోలీసులు... కార్‌ను ఆపి నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
నిందితులు వైజాగ్ నుంచి గంజాయి తీసుకొచ్చి... దూల్‌పేటకు తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల పైన గతంలో కూడా ఏమైనా కేసులు ఉన్నాయా.. వీరి ద్వారా గంజాయి ఎవరు తీసుకుంటున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇవాళ రిమాండ్కుతరలించారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!