నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10,310 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు.
ప్రజలెవరూ జూదాలకు బానిసలు కావొద్దని ఎస్సై సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచూడండి.. పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం