ETV Bharat / jagte-raho

కత్తులతో కొట్లాటకు దిగిన ఇద్దరు పోలీసులు - suryapet

సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్​ ఆవరణలో ఇద్దరు పోలీసులు కత్తులతో కొట్లాటకు దిగారు. నాగేశ్వర్ రావు అనే కానిస్టేబుల్ పై జరిగిన దాడిని విచారించిన పోలీసులు నిందితుడైన కానిస్టేబుల్​ నాగార్జునపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

అరెస్ట్​ చేసిన పోలీసులు
author img

By

Published : Mar 26, 2019, 11:51 PM IST

అరెస్ట్​ చేసిన పోలీసులు
సూర్యాపేట జిల్లా మోతే పీఎస్​లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, కోదాడ రూరల్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న నాగార్జున అనే కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు కత్తులతో ఘర్షణకు దిగారు. మోతే స్టేషన్​లో​ ఇటీవలి వరకు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ నాగార్జున వ్యక్తిగత ప్రవర్తనపై అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాకుండా సహచర కానిస్టేబుల్ నాగేశ్వరరావు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఘర్షణకు దిగాడు.

ఈ ఘటనలో నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి. బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోతే ఎస్ఐ సంతోష్, నాగార్జునపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడైన కానిస్టేబుల్ నాగార్జునకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: బడికి వెళ్లలేదని పిల్లాడి ఒంటిపై వాతలు పెట్టిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.