వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని మహిళా హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ బ్యాంకులో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా రాయినిగూడెంకు చెందిన ఓ యువకునితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వివాహం చేసుకుందామన్నారు. రోజులు గడవగా.. యువకుడు పెళ్లికి నిరాకరించగా అతనిపై బాధితురాలు సూర్యాపేట షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతి స్నేహితులైన విజయ్, ప్రవీణ్, కావ్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. పెళ్లి పేరుతో వంచించినందుకు యువతికి రూ. 4 లక్షలు చెల్లించాలని ఒప్పందం ఖరారు చేసుకున్నారు.
ఈ ఒప్పందాన్ని ఆసరా చేసుకున్న యువకులు.. షీటీం పోలీసులు అడిగారని బెదిరించారు. షీటీం పోలీస్‌గా ఓ యువకునితో ఫోన్లో మాట్లాడించారు. భయపడిన బాధిత యువతి.. రూ. 2 లక్షలు ముట్టజెప్పింది. ఆ తర్వాత తనను బెదిరించి వారు షీటీం పోలీసులు కాదని తెలుసుకుని బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారించి.. యువకులను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా