కరోనా సమయంలో.. ఉద్యోగం కోల్పోయి జీవనం గడవటం కోసం ఆప్ అనే యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి. రూ.10వేల రుణం తీసుకుని, రూ.19వేల వడ్డీని చెల్లించాడు.
ఒకటి తీర్చడం కోసం మరొకటి
ఒక రుణం తీర్చడం కోసం.. అదే పద్ధతిలో రెండో రుణం తీసుకోవడంతో వడ్డీలు అధికమయ్యాయని బాధితుడు తెలిపాడు. కాల్‌మనీ వేధింపులు భరించలేక అలా 8 యాప్‌ల నుంచి రూ.50వేలు తీసుకుని ఇప్పటివరకు రూ1లక్ష 30వేల వడ్డీ కట్టినట్లు వివరించాడు. ఇక వడ్డీలు కట్టడం తన వల్ల కాదని చెప్పటంతో.. కాల్‌మనీ కేటుగాళ్లు రెచ్చిపోయి, బాధితుని చరవాణిలో ఉన్న కాంటాక్ట్ లిస్ట్‌కు.. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారని వాపోయాడు.
ఆశ్రయం కల్పించిన స్నేహితుడు
కాల్‌మనీ కేటుగాళ్ల ఆగడాలు ఎక్కువవటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడే సమయంలో..తన స్నేహితుడు ధైర్యం చెప్పి,.. ఉండటానికి ఆశ్రయం కల్పించాడని తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాల్‌మనీ కేటుగాళ్ల ఆటలు కట్టించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.