భూదందాలు, కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతోన్న రౌడీ షీటర్ గోలనుకొండ ముత్యాలుపై పీడీ చట్టం నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వరుస అక్రమాలకు పాల్పడుతుండగా ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గోలనుకొండ ముత్యాలు స్థిరాస్తి వ్యాపారం చేస్తూ బెదిరింపులు, మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి అక్రమాలపై బీబీనగర్ పోలీస్ స్టేషన్లో 2011లో మొదటి కేసు నమోదైందని పేర్కొన్నారు. నయీం అనుచరుడిగా పేరు చెప్పుకొని పలువురిని బెదిరించినట్లు వెల్లడించారు.
బీబీనగర్ శివారులోని ఓ వెంచర్లో ప్లాట్లను కబ్జా చేసేందుకు తన అనుచరులతో కలిసి యజమానులపై బెదిరింపులకు పాల్పడ్డాడని... సెప్టెంబర్ 29న బీబీనగర్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైలుకు వెళ్లి, బెయిల్‌పై వచ్చి... దందాలు కొనసాగిస్తుండగా పీడీ చట్టాన్ని నమోదు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు మహేశ్ భగవత్ వివరించారు.
ఇదీ చదవండి: మంత్రాల నెపంతో రైతు దారుణహత్య..