ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుక కోసం గోదావరి ఒడ్డుకు 20 మంది యువకులు వెళ్లారు. పార్టీ అనంతరం గోదావరిలో నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు.
ఆ యువకుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని ప్రకాష్, కార్తీక్‌గా గుర్తించారు. మరో ఇద్దరు అన్వేష్, శ్రీకాంత్‌ల జాడ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌లతో మాట్లాడి ఆరా తీశారు. గల్లంతైన వారిని వెంటనే వెతికే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని... మునిగిపోయిన యువకులను వెతకడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ప్రశ్నార్థకంగా మారిన ఖానాపూర్ చెరువు ఉనికి