ETV Bharat / jagte-raho

బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు - భద్రాద్రి కొత్తగూడెం వార్తలు

ఆ ఊళ్లో పిల్లలు బడంటే భయపడిపోతున్నారు. మాస్టారు పేరు వింటే వణికిపోతున్నారు. ఇదేదో పాఠాలంటే భయపడో.. బడికి వెళ్లడం ఇష్టంలేకో కాదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి అకృత్యాలను తాళలేక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రేలోని ఎంపీపీ స్కూలు ప్రధానోపాధ్యాయుడి ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

author img

By

Published : Dec 15, 2020, 6:01 PM IST

బడిఈడు పిల్లలు ఇంట్లో కంటే బడిలోనే ఎక్కువ కాలం గడుపుతారు. కన్నవాళ్లతో చెప్పుకోలేని విషయాలను ఉపాధ్యాయులతో పంచుకుంటారు. అలాంటిది ఆ ఉపాధ్యాయుడి అకృత్యాలను కన్నవాళ్లతోను చెప్పుకోలేక మానసికంగా, శారీరకంగా నరకయాతన అనుభవిస్తున్నారు ఆ చిన్నారులు. బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడి అకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్షీదేవిపల్లి మండలం చింతవర్రెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డ సునీల్​పై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు.

గుడిలా భావించే బడిలోనే అకృత్యాలకు పాల్పడుతున్న ఆ ప్రధానోపాధ్యాయుడు సరస్వతి నిలయం సాక్షిగా వక్ర బుద్ధి చూపించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకే భయపడిపోతున్నారు.

ఆడపిల్లలను లైంగికంగా వేధించేవాడు, అసభ్యంగా ప్రవర్తించే వాడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని కత్తితో బెదిరించే వాడంట. పిల్లలు ఇంట్లో చెప్పుకోలేక నరకం అనుభవించారు.- విద్యార్థిని తల్లి.

బడికి వెళ్లినవారు అనారోగ్యం పాలవుతున్నారు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా పిల్లలకు నయం కాకపోవడం వల్ల అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడం వల్ల కీచకుడి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు కామాంధుడికి దేహశుద్ధి చేసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మూడు నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అతడు ప్రవర్తించిన తీరు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తోంది.

బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

ఇదీ చూడండి: భర్త ప్రాణం తీసిన భార్య వివాహేతర సంబంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.