ఏపీలోని గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు నెలల పసికందు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.
పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఎదురైతే సెప్టెంబరు 19న బాలుడిని చేర్పించామని.. ఇంతవరకూ చికిత్స కోసం 11 లక్షల రూపాయలు చెల్లించామని బాలుడి తండ్రి కాళేశ్వరరావు చెప్పారు. మరో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇవ్వకపోవడం వల్లే సరైన వైద్యం చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కాళేశ్వరరావు వాపోయారు.
ఇదీ చదవండి: వర్గల్లో విషాదం... ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్ బలవన్మరణం