ETV Bharat / jagte-raho

అధికారులు అవాక్కయ్యారు.. వైన్స్​ షాపుల ఓనర్లు బుక్కయ్యారు!

వరంగల్ గ్రామీణ జిల్లాలో వైన్స్​ షాపుల యజమానులు ఎక్సైజ్ అధికారులను బురిడీ కొట్టించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదుకు సంబంధించి.. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను టోకరా కొట్టించిన ఘటనలో 9 మందిపై చీటింగ్ కేసు నమోదైంది.

author img

By

Published : Jan 6, 2021, 11:06 AM IST

Owners of wine shops in Warangal rural district beat up excise officials
అధికారులు అవాక్కైయ్యారు.. వైన్స్​ షాపుల ఓనర్లు బుక్కైయ్యారు!

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో, వైన్స్​ షాపుల లైసెన్స్ రెన్యువల్ కోసం సర్కారు ఖజానాకు చెల్లించాల్సిన నగదుకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి యజమానులు, ఎక్సైజ్ అధికారులను టోకరా కొట్టించారు. ఈ ఘటనలో 9 మందిపై చీటింగ్ కేసు నమోదైంది.

మండలానికి చెందిన 4 వైన్స్​ షాపుల యజమానులు.. గత డిసెంబర్ 17న షాపుల లైసెన్స్ రెన్యువల్​కు సంబంధించిన రూ.68లక్షల 70వేలను స్థానిక ఎస్బీఐ బ్యాంకులో జమ చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. సంబంధిత అధికారులుకు చలానా పేపర్​లు సమర్పించారు.

షాపుల రెన్యువల్​కు సంబంధించిన అన్ని వివరాలను స్థానిక ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. వాటిలో 4షాపులకు సంబంధించిన నగదు.. ప్రభుత్వ ఖజానాలో జమ కాలేదన్న సమాచారంతో అధికారులు ఖంగుతిన్నారు.

ఆ మేరకు బ్యాంకు మేనేజర్​ను సంప్రదించిన అధికారులు.. అన్ని వివరాలు సేకరించారు. బ్యాంకు క్యాషియర్​కు, వైన్స్​ షాపుల ఓనర్లకు ఉన్న సత్సంబంధాలతో నగదు జమ చేయకున్నా.. చేసినట్లుగా తప్పుడు పేపర్లు ఇచ్చినట్లు వారు గుర్తించారు.

షాపుల యజమానులు, బ్యాంకు క్యాషియర్​ పైన పోలీసులకు ఎక్సైజ్ సీఐ ఫిర్యాదు చేశారు. వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: నకిలీ భూమి పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.