గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, కేసానుపల్లిలో దారుణహత్య జరిగింది. మందసాయివేణు అనే యువకుడు తన స్నేహితుడు బలుసుపాటి వీరాంజనేయులును కత్తితో పొడిచి హతమార్చాడు. లలీతాదేవి కాలనీకి చెందిన వీరాంజనేయులు , సాయివేణులు ఇద్దరు స్నేహితులు. బుధవారం రాత్రి వీరిరువురు మద్యం సేవిస్తుండగా ఘర్షణ తలెత్తింది.
గొడవలో వీరాంజనేయులును, సాయివేణు కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హతుడ్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.