ఈ రోజు ఉదయం హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై కారు డివైడర్ని గుద్దిన ఘటనలో సయ్యద్ ఫైజల్ అనే వ్యక్తి చనిపోయినట్లు శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించి, కారు అతివేగంగా నటపడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న మహ్మద్ షాబాజ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగితా నలుగురికి స్వల్ప గాయాలైనట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ దొరకటంతో యువకులకు ఆ దిశగా వైద్య పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అనుమానం: భార్య గొంతు కోసి పరారైన భర్త