యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో విద్యుతాఘాతంతో సురేశ్ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఓ భవన నిర్మాణంలో పని చేస్తుండగాా ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురై సురేశ్ అక్కడికక్కడే మరణించాడు.
మృతుడికి సంవత్సరం క్రితమే వివాహం అయ్యిందని తోటి పనివారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇదీ చూడండి: నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రేమ బాధితురాలు