ETV Bharat / jagte-raho

విషాదం: అత్తారింటికి వెళ్తూ... అనంతలోకాలకు - రెడ్డిపల్లిలో రోడ్డుప్రమాదం

అత్తారింటికి వెళ్తున్న వ్యక్తికి ఆటో రూపంలో మృత్యువు ఎదురైంది. ఈ విషాదకర ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో జరిగింది. అందరితో కలుపుగోలుగా ఉండే ఆ వ్యక్తి... మృత్యువాత పడటంపై ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

one died in bike accident at reddypally
one died in bike accident at reddypally
author img

By

Published : Nov 17, 2020, 9:19 AM IST

ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో జరిగింది. పెద్దచింతకుంట గ్రామానికి చెందిన కట్టా శ్రీకాంత్‌కు రెడ్డిపల్లికి చెందిన మౌనికతో ఏడాది క్రితం వివాహం జరిగింది. సోమవారం రాత్రి శ్రీకాంత్​ ద్విచక్రవాహనంపై నర్సాపూర్‌ మీదుగా... రెడ్డిపల్లికి వెళుతున్నాడు. అదే సమయంలో మెదక్‌ వైపు నుంచి వస్తున్న ఆటో ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చి డీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన శ్రీకాంత్‌.... అక్క డికక్కేడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం... మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి మృతి చెందగా... మంచి మిత్రున్ని కోల్పోయామని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గ్యాస్​ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.