ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో డ్రైవింగ్​.. ఒకరు బలి, ప్రాణాపాయ స్థితిలో మరొకరు - siddipet district crime news

మద్యం మత్తులో ట్రాక్టర్​ నడిపి ఓ వ్యక్తి ప్రాణాలను హరించాడు. మత్తు దిగాక చేసిన తప్పు తెలుసుకుని.. భయంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

one died in a accident at marpadaga in siddipet district
మద్యం మత్తులో డ్రైవింగ్​.. ఒకరు బలి, ప్రాణాపాయ స్థితిలో మరొకరు
author img

By

Published : Dec 10, 2020, 5:25 AM IST

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని కొల నారాయణ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నారాయణ గౌడ్ తన ఇంటి ముందు కూర్చుని టీ తాగుతున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లికి చెందిన జంగపల్లి రాజు అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతూ నారాయణగౌడ్​ను ఢీకొట్టాడు. ఘటనలో నారాయణగౌడ్ నడుంపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రున్ని వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణగౌడ్ మృతి చెందాడు.

ఈ క్రమంలో భయాందోళనకు గురైన డ్రైవర్ రాజు తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు రాజును సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు నారాయణ గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం.. రూ.1.20 లక్షలు నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.