ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్లో తలకిందులుగా పడి 18 నెలల బాబు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలోని భామన్ జగదీశ్, సీతాబాయి దంపతులకు నాలుగున్నర ఏళ్లకు జన్మించిన ఏకైక సంతానం గోపాల్(18 నెలలు) ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి చనిపోయాడు.
బుధవారం సాయంత్రం బాబు ఆడుకుంటూ వెళ్లి నీటి బకెట్లో తలకిందులుగా పడ్డాడు. బట్టలు ఉతుకుతున్న తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి తలకిందులుగా కనిపించాడు. తల్లి వచ్చి బకెట్ నుంచి బయటకు తీసేసరికి అప్పటికే బాబు మృతి చెందాడు. నాలుగున్నర ఏళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే మృతిచెందడం వల్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం