కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చింతగుడాలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుస శంకర్ అనే వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా... ఇసుకలోడ్తో వెళుతున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధునికి తీవ్రగాయాలయ్యాయి.
![old man severely injured in tractor accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-adb-09-09-kzr-tractor-accident-av-ts10034_09102020221549_0910f_03583_1084.jpg)
రెండు కాళ్లపై నుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జరగ్గానే ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయాడని స్థానికులు తెలిపారు. క్షతగాత్రున్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.