కాచిగూడ రైల్వే డివిజన్ పరిధిలోని యాకత్పురా రైల్వేస్టేషన్లో మహమ్మద్ అబ్దుల్ కరీం అనే 65 ఏళ్ల వృద్ధుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృత్యువాత పడ్డాడు. యాకత్పురాలోని అజ్మత్నగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు.
గురువారం ఉదయం 9 గంటల సమయంలో యాకుత్పురా రైల్వే స్టేషన్లో తన ఇంటికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కాచిగూడ రైల్వే పోలీసు అధికారి లాల్య నాయక్ తెలిపారు.
ఇవీ చూడండి: పదిహేను రోజుల క్రితం కిడ్నాప్... ఇవాళ గుండెపోటుతో మృతి