ETV Bharat / jagte-raho

జానకంపేట్​లో క్షుద్రపూజల కలకలం - nizamabad

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్​లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు యువకులను ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Occult Poojas at janakampet in nizamabad districts
జానకంపేట్​లో క్షుద్రపూజల కలకలం
author img

By

Published : May 6, 2020, 1:52 PM IST

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్​లోని చిన్న హనుమాన్​ మందిర్​ సమీపంలో పలువురు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గుప్త నిధులతో పాటు, కుటుంబంలో శాంతి కోసం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బండె మోహన్, జానకంపేట గ్రామానికి చెందిన బోయిడి సాయి, వినయ్​ అనే ముగ్గురు పూజలు చేస్తున్నారు.

పసుపు, కొబ్బరికాయ పెట్టి పూజలు నిర్వహిస్తుండగా పలువురు కాలనీ వాసులు వారిని పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పక్కనే ఉన్న హనుమాన్​ ఆలయంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.