ETV Bharat / jagte-raho

'కేటీఆర్​ సార్​.. ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి'

ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు యువకుడిని బెదిరిస్తున్న ఘటన హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడిని హత్య చేస్తామని బెదిరిస్తున్నట్టు ప్రేమ జంట ఆరోపిస్తున్నారు.

new couple complaint to ktr and dgp in twitter for protection
కేటీఆర్​ సార్​.. మాకు రక్షణ కల్పించండి
author img

By

Published : Jun 21, 2020, 7:52 PM IST

ఆసిఫ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8న... మౌనిక, సురేష్ ఆర్యసమాజ్​లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రేమ వివాహం గురించి పీఎస్​లో సమాచారం ఇవ్వగా... ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిచి చెప్పారు. ఈ వివాహం మౌనిక కుటుంబసభ్యులకు నచ్చలేదు. ఆమె పేరుపై ఉన్న ఆస్తులకు సంబంధించి... బాండ్​ పేపర్​పై బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఎస్సై బురాన్ మూడు రోజులుగా... సురేష్ కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

స్టేషన్​కు వచ్చి మౌనికను అప్పగించకపోతే... తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తున్నట్టు బాధితులు.. ట్విట్టర్ ద్వారా కేటీఆర్​, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ ప్రణయ్​ను చేసినట్టు హత్య చేస్తామని బెదిరిస్తున్నారు, మాకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం అలాంటిదేం లేదని, మౌనికకు ఇష్టం లేకున్నా... వారి వద్ద ఉంచుకున్నారని తెలిపారు. మౌనికపై ఆమె తల్లిదండ్రులు దొంగతనం కేసు పెట్టడం వల్ల స్టేషన్​కు పిలిపించినట్టు పోలీసులు చెప్తున్నారు.

కేటీఆర్​ సార్​.. మాకు రక్షణ కల్పించండి

ఇదీ చూడండి: కుమురంభీం జిల్లాలో అక్రమ కలప పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.