మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నట్లు నర్సాపూర్ ఎస్సై తెలిపారు. రాజు, సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రెండురోజుల క్రితం రాత్రి సమయంలో ఎస్బీఐ బ్యాంకులో వెంటిలేటర్ తొలగించి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో శబ్ధం విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు అధికారులను పిలిపించి పోలీసులు లోపలికి వెళ్లగా.. అందులో ఓ మూలన దాక్కుని ఉన్న రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారివురిని అరెస్టు చేశారు.
అంతకుమునుపు అహ్మద్‌నగర్ గ్రామంలో నిందితులు చోరీచేసిన సొత్తు, 13 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇళ్ల వద్ద, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు ఎస్సై సూచించారు.
ఇదీ చదవండి: కడుపు నొప్పి భరించలేక బలవన్మరణం