ETV Bharat / jagte-raho

సింగపూర్​లో మర్డర్ ఫ్లాన్.. ఉంగుటూరులో అమలు.. - చిన వెల్లమిల్లి మర్డర్ కేసు వార్తలు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సింగపూర్​లో ఫ్లాన్​ వేశాడో వ్యక్తి. తాను ప్రేమించిన మహిళ భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. సింగపూర్​లో.. గతంలో తనతో పనిచేసిన వ్యక్తిని హత్యకు పురమాయించాడు. సింగపూర్ వచ్చేందుకు పూర్తి ఖర్చు చెల్లిస్తానని ఆశ చూపాడు. చివరికి హత్యయత్నం విఫలమై అసలు విషయం బయటపడింది.

సింగపూర్​లో మర్డర్ ఫ్లాన్.. ఉంగుటూరులో అమలు..

author img

By

Published : Nov 20, 2020, 7:15 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పరిధిలోని చిన్న వెల్లమిల్లిలో ఈ నెల 3న జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం... ఉంగుటూరు మండలం చిన్న వెల్లమిల్లికి చెందిన ఎలిబండి స్వామి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి...స్వామిపై హత్యయత్నం చేశాడు. స్వామి కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.

కుటుంబ సభ్యులు స్వామిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి వదిలివెళ్లిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మమ్మురం చేశారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి చాకు మరో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అడ్డు తొలగించేందుకే..

స్వామి భార్య దగ్గరి బంధువు కిషోర్ సింగపూర్​లో వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఆమెను ప్రేమిస్తున్నానని స్వామిని అడ్డు తొలగించాలని గతంలో తనతో పాటు పనిచేసిన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం సంగటపల్లి గ్రామానికి చెందిన చిత్తోలపల్లి శివ నరసింహారెడ్డిని కోరాడు. ఇందుకుగాను మళ్లీ సింగపూర్ రావడానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని, మరో రూ. 45 వేలు ఇస్తానని నరసింహారెడ్డికి ఆశ కల్పించాడు. స్వామి ఫోటోలను నరసింహా రెడ్డికి పంపాడు. ద్విచక్ర వాహనాన్ని కూడా సమకూర్చాడు. హత్యాయత్నం విఫలం కావడంతో తన బెయిల్ ఖర్చులకు రూ. 15 వేలు ఇస్తానని చెప్పడంతో నరసింహారెడ్డి చేబ్రోలు సమీపంలోని నారాయణపురం వచ్చాడు. దీంతో నిందితుడు నరసింహారెడ్డిని చేబ్రోలు ఎస్సై వీర్రాజు తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కుట్రపన్నిన కిషోర్ సింగపూర్​లో ఉండటంతో ఎస్పీ ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి : 'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.