ETV Bharat / jagte-raho

యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి

author img

By

Published : Sep 21, 2020, 11:41 PM IST

నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిని ప్రశ్నించిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఆటోతో ఢీకొట్టిన పర్వేజ్​ను ప్రశ్నించిన అర్షద్​పై కత్తితో దాడి చేశాడు. ఘటనలో బాధితుడికి గాయాలయ్యాయి.

యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి
యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి

హైదరాబాద్​ పాతబస్తీ చంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆటోను నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన పర్వేజ్​ను ప్రశ్నించిన అర్షద్​పై దాడికి పాల్పడ్డాడు.

తాళ్లకుంట ప్రాంతంలో ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని పర్వేజ్... ఆటోతో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ద్విచక్రవాహన యజమాని అర్షద్​... పర్వేజ్​తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అర్షద్​పై పర్వేజ్​ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు పర్వేజ్​పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అక్రమంగా రుణాలు తీసుకున్నారని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.