ETV Bharat / jagte-raho

దారుణం: కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడు - crime updates in hyderabad

పొట్టకూటికి హైదరాబాద్​ నగరానికి వచ్చి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను కంటికి రెప్పలా సాకింది. కరోనా మహమ్మారికి ఇటీవల భర్త బలయ్యాడు. దుఃఖాన్ని దిగమింగుకుని సంతానంలోనే సంతోషాన్ని వెతుక్కున్న ఆమె పాలిట చిన్న కొడుకే కాల యముడయ్యాడు. గంజాయికి బానిసైన అతను డబ్బుల విషయంలో ఉన్మాదిగా మారి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. పేగులు బయటపడేంతగా కన్న తల్లిని కత్తితో పలుమార్లు పొడిచి కర్కశంగా హత్య చేశాడు.

mother murdered in the hands of son at sr nagar area in hyderabad
గంజాయికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఘాతుకం
author img

By

Published : Jan 10, 2021, 7:01 AM IST

Updated : Jan 10, 2021, 9:07 AM IST

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు గంజాయి మత్తులో కన్నతల్లినే హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా, బసవకల్యాణ్‌ తాలుకా నిర్గుందికి చెందిన సంగీత(50) 30 ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి బల్కంపేటలో ఉంటోంది. భర్త వీరన్న ఇటీవల కరోనాతో మృతి చెందారు. మూడో కుమారుడు సంతోష్‌ గంజాయికి బానిసయ్యాడు. ఇటీవల ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు సమాచారం. గంజాయి మత్తులో తరచూ ఉన్మాదిలా ప్రవర్తించే సంతోష్‌.. కుటుంబ సభ్యులతో ఘర్షణ పడేవాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లితో గంజాయి కోసం డబ్బులు కావాలంటూ శనివారం గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో కోపం పట్టలేక కత్తితో ఆమె పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం సంతోష్‌ లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు వచ్చి తలుపు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదులు తెలిపారు.

ఇదీ చూడండి: కల్తీ కల్లు కల్లోలం: 212 మందికి అస్వస్థత, ఒకరు మృతి

Last Updated : Jan 10, 2021, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.