ETV Bharat / jagte-raho

విధులకు వెళ్లి వచ్చేసరికి భార్య, కుమారుడు అదృశ్యం - patancheru news

విధులకు వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లో భార్య , కుమారుడు కన్పించలేదు. చుట్టుపక్కల చూశాడు... తెలిసిన వాళ్లింటికి వెళ్లారేమో ఆరా తీశాడు. తనకు తెలిసిన అన్ని చోట్లా వెతికాడు. అయిన ఆచూకీ లేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జరిగింది.

mother and son missing in patancheru
mother and son missing in patancheru
author img

By

Published : Aug 29, 2020, 6:45 AM IST

ఓ పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుడు విధులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పటాన్​చెరులో చోటుచేసుకుంది. బిహార్​లోని యిజ్పూర్ జిల్లా కిష్వన్ గ్రామానికి చెందిన ప్రభాకర్... పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. తన భార్య రాణి దేవి, కుమారుడు సమీర్​తో కలిసి గోకుల్ నగర్​లో నివాసం ఉంటున్నాడు.

ఈనెల 26న పరిశ్రమలో విధులకు వెళ్లిన ప్రభాకర్​... సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల, తెలిసిన చోట్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక చేసేదేమిలేక పటాన్​చెరు ఠాణాలో ప్రభాకర్​ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.