సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సాకీ చెరువులో విషాదం చేటుచేసుకుంది. అంబేడ్కర్ కాలనీలో నివాసముంటున్న స్వప్న... కూలీపని చేసుకుంటూ జీవిస్తుంది. భర్త శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం చనిపోగా... ఇద్దరు పిల్లల్లో కూతురుని మునిపల్లి మండలం చీలపల్లిలో ఉంటున్న అత్తమామల వద్ద ఉంచింది. కొడుకు కార్తీక్ను తనతో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తల్లీకొడుకులు బయటకు వెళ్లారు.
ఎంత సేపటికీ ఇంటికి రాకపోయే సరికి.... అదే కాలనీలో ఉంటున్న స్వప్న తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఈరోజు సాకీ చెరువులో మృతదేహాలు తేలగా... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను బయటికి తీసిన పోలీసులు... స్వప్న, కార్తీక్లుగా గుర్తించారు. స్వప్న తండ్రి నరసింహులు మాత్రం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులకు చెబుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.