నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో కోటమ్మ(80), బుజ్జమ్మ(53) అనే ఇద్దరు తల్లీకూతుళ్లు మట్టి ఇంట్లో ఉంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శనివారం రాత్రి ఆ మట్టి ఇల్లు కూలడం వల్ల వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం గ్రామస్ధులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులకు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం పోర్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కూతురు బుజ్జమ్మ మానసిక వికలాంగురాలు. తల్లీకూతుళ్లు ఇద్దరు ఆసరా పెన్షన్‌తో జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. వాళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమానుషం....
జిల్లా ఆస్పత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలో సుమారు రెండు గంటల పాటు ఆ మృతదేహాలు వర్షంలో తడుస్తూనే ఉన్నాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.