హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని షిర్డీహిల్స్ మజీద్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఏడాది వయసున్న చిన్నారి సహా లావణ్య అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోని సంపులో శవమై తేలింది. దౌల్తాబాద్ చందా నగర్‌కు చెందిన మల్లేశ్... తన భార్యతో కలిసి 10 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడం వల్ల లావణ్యను ఆరేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. రెండేళ్లుగా లావణ్య తరచుగా భర్తతో గొడవ పడేదని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: లొంగిపోయిన లలితా జ్యూవెలరీ చోరీ ప్రధాన నిందితుడు