సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శేఖర్, దేవిశ్రీలు నాలుగేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 17న భర్త శేఖర్ కూలీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని విచారించగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన సోదరిని చూసేందుకు పిల్లలతో కలిసి వెళ్లిందని ఆటో డ్రైవర్ మహేష్ శేఖర్‌కు తెలిపారు.
అప్పటికే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిపోగా.. అత్తింటికి ఫోన్ చేసి శేఖర్ విచారించారు. అక్కడికి కూడా రాలేదని తెలుపగా.. శేఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలే దేవిశ్రీ వెళ్లిపోవడానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండిః సిగరెట్ కోసం వచ్చాడు.. కత్తితో దాడి చేసి గొలుసు లాక్కెళ్లాడు